అగ్ని ప్రమాదం.. 20 ఎకరాల వరి పంట బుగ్గిపాలు

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది..

అగ్ని ప్రమాదం.. 20 ఎకరాల వరి పంట బుగ్గిపాలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam)లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. మందస మండలం జిల్లుండలో వరి పొలా(Rice Field)నికి గుర్తు తెలియనివ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. పక్క పొలాలకు సైతం అంటుకుని మంటలు చెలరేగాయి. మొత్తం 20 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. అయితే పొలాల్లోకి ఇంజిన్లు వెళ్లలేకపోయాయి. దీంతో 20 ఎకరాల వరి పంట అగ్నికి ఆహుతైంది. ఆరుగాలం పండించిన వంటపంట చేతికొచ్చే సమయంలో బుగ్గిపాలవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుగుతున్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story