ఏపీ ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. విధుల్లో 300 మంది ఉద్యోగులు

by Naga Rani Yarlagadda |

ఏపీ ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.

ఏపీ ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. విధుల్లో 300 మంది ఉద్యోగులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మంగళగిరి (Mangalagiri)లో ఉన్న నిధి భవన్ (Nidhi Bhavan)లోని సెకండ్ ఫ్లోర్లో మంటలు వ్యాపించడంతో ఉద్యోగులంతా భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో భవనంలో 300 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, దస్త్రాలు కాలిపోయి ఉండవచ్చని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన ఆదాయ, వ్యయాల బిల్లులు కూడా కాలిపోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ (AC Short Circuit) వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మినహా ఇతరులను లోపలికి అనుమతించకపోవడంతో.. ప్రమాద తీవ్రత గురించిన సమాచారం తెలియడం లేదు. ఈ అగ్నిప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story