గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

by Naga Rani Yarlagadda |

గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న వస్తువులు, ఫైళ్లు, వెహికల్స్ దగ్ధమయ్యాయి.

గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన గోదాంలో మంటలు చెలరేగడంతో.. పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి. సీజ్ చేసిన వెహికల్స్, మద్యం బాటిళ్లు, స్వాధీనం చేసుకున్న వస్తువులు సైతం తగలబడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన భవనానికి పక్కనే తహసీల్దార్, ట్రెజరీ, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సీజ్ చేసిన వస్తువుల్లో దీపావళి టపాసులు, గ్యాస్ సిలిండర్లు కూడా ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువైనట్లు పోలీసులు, ఫైర్ సిబ్బంది గుర్తించారు. డీఎస్పీ ధీరజ్ వినిల్ సీసీఎస్ ఆఫీసుకు చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను డీఎస్పీ ఆదేశించారు.

Next Story