ఒంగోలు సెల్‌టవర్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు

by Naga Rani Yarlagadda |

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సెల్ఫోన్ టవర్ (Cell Phone Tower)లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.

ఒంగోలు సెల్‌టవర్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సెల్ఫోన్ టవర్ (Cell Phone Tower)లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో సెల్ ఫోన్ టవర్ దగ్ధమైంది. అద్దంకి బస్టాండ్ సెంటర్లో (Addanki Busstand Center) ఉన్న ఎయిర్టెల్ సెల్ఫోన్ టవర్ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. భయాందోళనకు గురైన స్థానికులు.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేశారు. కాగా.. మంటలు భారీగా ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూటే ఇందుకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Next Story