కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-28 04:50:58  IST  )

ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు...

కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. అటు శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26కు గాను రూ. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమచారం. ఈ బడ్జెట్‌కు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌పై ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంలో అంతా నిర్లక్ష్యం వహించారని, విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పారు. 2024లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్విర్మాణం చాలా సవాళ్లతో కూడుకున్నదని పయ్యావుల తెలిపారు.

Next Story