చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్.. శ్రీవారి ప్రసాదం అందజేత

by Vemula.Srinu Prasad |

23 రోజుల పాటు 535 కి.మీ మేర తిరుమల పాదయాత్ర చేసి శ్రీవారిని దర్శించుకుని అనంతరం సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేశ్ కలిసి ప్రసాదం అందజేశారు..

చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్.. శ్రీవారి ప్రసాదం అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు(Chief Minister Chandrababu)ను సినీ నిర్మాత బండ్ల గణేష్(Film producer Bandla Ganesh) కలిశారు. సీఎం చంద్రబాబు కోసం ఆయన 23 రోజుల పాటు 535 కి.మీ మేర తిరుమల పాదయాత్ర(Tirumala Padayatra) చేశారు. షాద్‌నగర్ నుంచి జనవరి 19న బండ్ల గణేష్ పాదయాత్ర కొనసాగించారు. ఫిబ్రవరి 10న తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం తిరిగి వచ్చి చంద్రబాబును కలిశారు. శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్బంగా పాదయాత్ర జరిగిన తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకున్నారు. అనంతరం బండ్ల గణేష్‌ను అభినందించారు.

Next Story