- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రాజకీయాలకు, మతపరమైన అంశాలకు టాలీవుడ్ దూరం: చంద్రబాబు అరెస్ట్‌పై దగ్గుబాటి సురేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉంది అని అన్నారు. అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదు అని సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ వెల్లడించారు. ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దగ్గుబాటి సురేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు. చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేశారని అందులో ఎలాంటి సందేహమే లేదని చెప్పుకొచ్చారు. అలాగని చంద్రబాబు అరెస్ట్‌పై చిత్ర పరిశ్రమ స్పందించలేదనే వ్యాఖ్యలు సరికాదు అని అన్నారు. చంద్రబాబు అరెస్టు అనేది చాలా సున్నితమైన అంశమని చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమ రాజకీయ, మతపరమైన అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేయదని... అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పైనా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని దగ్గుబాటి సురేశ్ వివరణ ఇచ్చారు. సినీ పరిశ్రమ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని తాము భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాజకీయంగా ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదని తాము అభిప్రాయపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎందుకంటే తాము రాజకీయ నాయకులం కాదు.. మీడియా వాళ్లం కూడా కాదు అని చెప్పుకొచ్చారు. తాము సినీ పరిశ్రమకు చెందిన వారిమని.. సినిమాలు నిర్మించడం విడుదల చేయడం తమ పని అని అంతేగానీ రాజకీయ ప్రకటనలు ఇవ్వలేమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుతోపాటు చాలా మంది ముఖ్యమంత్రులు సినీ ఇండస్ట్రీ డవలప్‌మెంట్‌కు సహకరించారని అన్నారు. మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌తోపాటు చంద్రబాబు నాయుడు కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారని అన్నారు.అలాగని చిత్ర పరిశ్రమ స్పందించడం లేదని కామెంట్ చేయడం సరికాదని సురేశ్ బాబు అన్నారు. ఎవరైనా వ్యక్తిగతంగా స్పందిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. తన తండ్రి రామానాయుడు టీడీపీ సభ్యుడని... తాను కూడా టీడీపీ కోసం పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. అది తమ వ్యక్తిగతం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తామంతా సినీ పరిశ్రమకు చెందిన వారిమని అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించడం లేదు అని సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ కీలక వ్యాక్యలు చేశారు.