తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-14 15:07:32  IST  )

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తాజాగా సినీ నటి సంయుక్త మేనన్(Sanyukta Menon) శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ(శుక్రవారం) వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నటి సంయుక్తతో సెల్ఫీ ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అనంతరం నటి సంయుక్త మేనన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు. అలాగే వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం తనకు సంప్రదాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె మూవీ అప్‌డేట్స్(Movie Updates) గురించి పలు విషయాలు వెల్లడించారు.

Read Also.. Alia Bhatt: కేన్స్ వైపు స్టార్ హీరోయిన్ అడుగులు.. కొంచెం భయంగా ఉందంటూ కామెంట్స్

Next Story