- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:శ్రీవారి సేవలో సినీ నటి ఐశ్వర్య రాజేష్
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు(Devotees) విశ్వసిస్తారు. ఈ తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీవారి దర్శనానికి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సైతం శ్రీవారి దర్శనానికి తిరుమల కొండకు చేరుకుంటారు.
ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) ఉదయం తిరుమల(Tirumala)లో సినీ నటి ఐశ్వర్య రాజేశ్(Aishwarya rajesh) సందడి చేశారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం చేసి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.






