Nara Lokesh పాదయాత్రలో అపశృతి.. స్పృహతప్పి పడిపోయిన Taraka Ratna

by GSrikanth |
Nara Lokesh పాదయాత్రలో అపశృతి.. స్పృహతప్పి పడిపోయిన Taraka Ratna
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కుప్పం నియోజకవర్గంలో 'యువగళం' పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కుప్పంకు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు, టీడీపీ యుతనేత తారకరత్న కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకస్మాత్తుగా తారకరత్న లోకేష్ వాహనం పైనుంచి స్ప్రహతప్పి కిందపడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన నాయకులు వెంటనే తారకరత్నను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా, మరోపక్క లోకేష్ పాదయాత్ర, టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారిపోయింది. జై యువగళం అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.

Also Read...

ఆ కమ్యూనిటీ ఓటర్లపై ప్రధాన పార్టీల ఫోకస్.. ఆకర్షించేలా వ్యూహాలు!

Next Story

Most Viewed