Posani: తప్పు చేస్తున్నావ్ పవన్..ముద్రగడకు క్షమాపణ చెప్పు

by Vemula.Srinu Prasad |

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

Posani: తప్పు చేస్తున్నావ్ పవన్..ముద్రగడకు క్షమాపణ చెప్పు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం వర్సెస్ పవన్ కల్యాణ్‌గా సాగుతున్న వేళ ఆయన మీడియా ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో కాపు నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘పవన్ కల్యాణ్ తప్పు చేస్తున్నావ్, మీ కాపుల్ని నువ్వే తిట్టి దూరం చేసుకుంటున్నావ్’ అని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ వల్లే కాపుల్లో చిచ్చు మొదలైందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడటం ఏంటని పోసాని ప్రశ్నించారు.

పవన్ చాలా మంచి వాడని.. ఇప్పుడెందుకో ఇలా అయిపోయాడని పోసాని సెటైర్లు వేశారు. ఏపీలో కాపుల వద్దకు వెళ్లి మంచి చెడులను అడిగి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు కూడా కమ్మ కులాన్ని తిట్టలేదని గుర్తు చేశారు. ఈ రోజుల్లో చంద్రబాబును సపోర్ట్ చేయడం ఏంటని నిలదీశారు. చంద్రబాబు, లోకేశ్ కన్నా పవన్ కల్యాన్ చాలా మంచివాడని కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ సభలకు వస్తున్న స్పందనపైనా పోసాని సెటైర్లు వేశారు. సినిమా ఆర్టిస్ట్ అని పవన్ కల్యాణ్‌ను చూడ్డానికి వస్తున్నారని పోసాని ఎద్దేవా చేశారు.

Next Story