- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ ముమ్మరం..రంగంలోకి మరో ఇద్దరు అధికారులు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు వేగం పుంజుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగం పుంజుకుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంకావడంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానించింది. ఇందులో భాగంగా మరికొంతమంది అధికారులతో విచారణ చేయించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వెళ్లాలని ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీ జెన్కో సీఎండీలకు ఆదేశించింది. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది. ఇక మదనపల్లె ఎమ్మార్వో ఆఫీసు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులు, భూరికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక కాలిపోయిన ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైళ్లలో ఉన్న సమాచారానికి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story






