ఏలూరు గ్రీన్‌ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు రిమాండ్‌

by Vemula.Srinu Prasad |

ఏలూరు గ్రీన్‌ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు రిమాండ్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు గ్రీన్‌ సిటీ(Eluru Green City)లో పట్టుబడిన 15 మంది మావోయిస్టుల(Maoists)కు కోర్టు రిమాండ్‌ విధించింది. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కేంద్ర బలగాలు విజయవాడలో 32 మంది, ఏలూరులో 12 మంది, కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏలూరు గ్రీన్‌ సిటీలో పట్టుబడిన 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారం ఏలూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వారికి ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అలాగే వారిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించింది.

మరోవైపువిజయవాడలో పట్టుబడిన 24 మంది మావోయిస్టులను సైతం రిమాండ్‌‌ నిమిత్తం రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు సూచించింది. అలాగే మరో నలుగురు మావోయిస్టులకు వయోపరిమితి నిర్ధారించాలని ఆదేశించింది.

Next Story