- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరులో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ హల్ చల్.. స్కూటీపై వచ్చి తరిమికొట్టిన మహిళా ఎమ్మెల్యే
ఆకతాయిల ఆటకట్టించేందుకు మహిళా ఎమ్మెల్యేనే నేరుగా రంగంలోకి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లాల్లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆకతాయిల ఆటకట్టించేందుకు మహిళా ఎమ్మెల్యేనే నేరుగా రంగంలోకి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లాల్లో చోటు చేసుకుంది. గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఏరియాలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆకతాయిలు గంజాయి మత్తులో హల్ చల్ చేశారు. ఆకతాయిల అల్లరి ఎక్కువ అవ్వడంతో స్థానిక మహిళ ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలంటూ కోరారు. దీంతో అర్ధరాత్రి ఎమ్మెల్యే గల్లా మాధవి స్కూటీపై ఘటనాస్థలానికి బయలుదేరారు. అక్కడకు వెళ్లగా ఎమ్మెల్యేను చూసి ఆకతాయిలు పరార్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన మాధవి గస్తీ పెంచి ఆకతాయిల బెడద లేకుండా చూడాలని కోరారు.
ఫోన్ చేసిన వెంటనే సింగిల్ గా స్కూటీపై ఎమ్మెల్యే రావడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. స్థానిక ప్రజలు, ఫిర్యాదు చేసిన మహిళతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం గల్లా మాధవి స్కూటీపై వచ్చిన వీడియో వైరల్ అవ్వడంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రేట్ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.






