హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణికి ఏపీలో స‌న్మానం

by Ajay Maddhiboyina |

ఏపీ ప్రభుత్వం, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంయుక్తంగా, కాంటినెంటల్ కాఫీ ప్రొడక్ట్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ భాగస్వామ్యంతో " ఉద్యాన పంటలు - ఫుడ్ ప్రాసెసింగ్ - అవకాశాలు, అవరోధాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ  అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణికి ఏపీలో స‌న్మానం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంయుక్తంగా, కాంటినెంటల్ కాఫీ ప్రొడక్ట్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ భాగస్వామ్యంతో " ఉద్యాన పంటలు - ఫుడ్ ప్రాసెసింగ్ - అవకాశాలు, అవరోధాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అసిస్టెంట్ డైరెక్టర్ డి.చక్రపాణి హాజరయ్యారు. ఉద్యాన పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్ పై ఆయ‌న ప్ర‌సంగించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అతిథిగా హాజ‌రై చేసిన ప్ర‌సంగానికి గాను ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఆయ‌న‌కు స‌న్మానం చేశారు. కార్య‌క్ర‌మంలో ఎంపీ జి. లక్ష్మీనారాయణ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, చల్లా రాజేంద్ర ప్రసాద్ మ‌రియు ఏపీ ఉద్యానవన శాఖ అదనపు డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story