- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
sucide: బావిలో దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్య?
శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామం వద్ద బావిలో దూకి తల్లీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామం వద్ద బావిలో దూకి తల్లీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ బావిలోకి దూకి వీరిద్దరూ ఈ చర్యకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామం నుంచి వచ్చిన వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని జ్ఞానాపురం చర్చిలో ఓ బాలిక మరణించింది. బాలిక ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉండడం కలకలం రేపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలిక తల్లి, అమ్మమ్మ.. గూడెం గ్రామం వద్ద ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతురు ఒకరేనని చెబుతున్నారు. బాలిక మరణించాడానికి ముందు ఆమెకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళితే నయమవుతుందని ఆమె తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు భావించారు. అయితే, తనకు తెలియకుండా తన కూతురును చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి నిన్నటి రోజున ఆరోపించాడు. బాలిక నోట్లో గుడ్డలు చుట్టి ఉండడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పోలీసులు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వదిలారు. ఈ క్రమంలో మళ్లీ విచారణకు పిలుస్తారనే అనుమానంతో వారిద్దరూ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీస్ కేసులకు భయపడి బావిలో దూకి సూసైడ్ చేసుకున్నారా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.






