- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతపురంలో విషాదం.. కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం
by Naga Rani Yarlagadda |
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని బెళుగుప్ప మండలం నక్కలపల్లిలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డి కుటుంబ కలహాల కారణం ఇద్దరు కుమార్తెలు కువిజ్ఞారెడ్డి (7), చైత్రా రెడ్డి (3)కి విష గుళికలు ఇచ్చాడు. అనంతరం తాను కూడా ఆ గుళికలనే మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ముగ్గురూ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి కల్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






