కూతురిపట్ల కన్నతండ్రి దారుణం.. నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి!

by Naga Rani Yarlagadda |

తన ప్రియురాలితో కలిసి కన్నకూతురిలో దారుణానికి పాల్పడ్డాడో కర్కశ తండ్రి. ఈ దారుణం మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో వెలుగుచూసింది.

కూతురిపట్ల కన్నతండ్రి దారుణం.. నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియురాలితో కలిసి కన్నకూతురిని కడతేర్చాడో కర్కోటక తండ్రి. ఈ దారుణ ఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో చోటుచేసుకుంది. బాలిక తండ్రి శివారెడ్డికి.. బాజీబీ అనే మరో మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లుగా ఈ సంబంధం కొనసాగుతోంది. వీరిద్దరి గురించి కూతురు తులసివందనకు తెలిసింది. దీంతో కూతురు తన అక్రమ సంబంధాన్ని భార్య ఈశ్వరమ్మకు ఎక్కడ చెప్తుందోనని ప్రియురాలితో కలిసి దారుణంగా హతమార్చాడు. బాలికను మభ్యపెట్టి బాజీబీ ఇంటికి తీసుకెళ్లిన శివారెడ్డి.. నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులు కట్టేసి, మెడకు ఇనుప తీగను బిగించి అతి కిరాతకంగా హతమార్చాడు. కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఈశ్వరమ్మ.. శివారెడ్డిపై అనుమానంతో బాజీబీ ఇంటికి వెళ్లింది. అక్కడ కూతురు చనిపోయి కనిపించడంతో కన్నీరుమున్నీరై.. పోలీసుల్ని ఆశ్రయించింది. కన్నకూతురిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన శివారెడ్డి, బాజీబీలను పోలీసులు అరెస్ట్ చేశారు. శివారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. బాలిక బంధువులు అడ్డుకుని చితకబాదారు. చిన్నపిల్లని చంపడానికి మనసెలా వచ్చిందంటూ దుమ్మెత్తిపోశారు. పోలీసులు వారిని వారించి.. శివారెడ్డిని జైలుకు తరలించారు.

Next Story