- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిడదవోలు రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. తండ్రి, కుమార్తెకు గాయాలు
by Vemula.Srinu Prasad |
రైలు నుంచి జారిపడిన తండ్రి, కుమార్తుకు పెను ప్రమాదం తప్పింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: రైలు నుంచి జారిపడిన తండ్రి, కుమార్తుకు పెను ప్రమాదం తప్పింది. గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏపీలోని నిడదవోలు రైల్వే స్టేషన్‌లో జరిగింది. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌లో శ్రీకాకుళం నుంచి తిరుపతికి తండ్రి, కుమార్తె వెళ్తున్నారు. అయితే నిడదవోలు రైల్వే స్టేషన్‌లో రైలు ఆగడంతో మంచినీళ్ల బాటిల్ కోసం దిగారు. కొద్దిసేపటికే కదలడంతో హుటాహుటిన రైలు ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రైలు నుంచి జారీ పడ్డారు. అయితే తోటిప్రయాణికులు గమనించి చైన్ లాగి రైలును నిలిపివేశారు. రైలు నుంచి జారీ పడిన తండ్రి, కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ మేరకు వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






