Atrocious: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న కార్లు.. భాదితుల పరిస్థితి..?

by Disha Web Desk 3 |
Atrocious: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న కార్లు.. భాదితుల పరిస్థితి..?
X

దిశ,మడకశిర: అతివేగం అత్యంత ప్రమాదకరమని తెలిసీ కొందరు అతివేగంతోనే ప్రయాణిస్తుంటారు. చివరికి ప్రమాదాలకు గురై ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా అలాంటి ఘటనే అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు (మంగళవారం) అనంతపురం జిల్లా రొళ్ల మండల సమీపంలోని హైవే రోడ్డు పై రెండు కార్లు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా పోలీసుల సమాచారం ప్రకారం.. ఒక కారు మడకశిర వైపు నుంచి మరొక కారు ఆగలి వైపు నుంచి వస్తుండగా మలుపు వద్ద ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

కానీ రెండు కార్లలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. దీనితో ప్రమాదానికి గల కారణపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే స్థానికుల సమాచారం ప్రకారం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.



Next Story

Most Viewed