Fatal road accident: ఆ చిన్నారులిద్దరూ మృత్యుంజయులు..

by Thanuru Gopichand |   (  Updated:2025-05-23 11:14:10  IST  )

ప్రకాశం జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Fatal road accident: ఆ చిన్నారులిద్దరూ మృత్యుంజయులు..
X

ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ప్రకాశం జిల్లా తాడిచర్లమోటు వద్ద లారీని ఢీకొన్న కారు..

దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఘటన

దిశ, డైనమిక్​ బ్యూరో : ప్రకాశం జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొమరోలు మండలం తాడిచర్లమోటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మహానంది (Mahanadni) దర్శించుకుని వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా చెబుతున్నారు. కారు క్యాబిన్ నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు గంటసేపు రిస్క్యూ ఆపరేషన్​చేసి స్థానికుల సహకారంతో జేసీబీని ఉపయోగించి అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృత్యుంజయురాలుగా బయటపడింది. ఈ ఘటనతో ఆ చిన్నారి తీవ్ర భయకంపితురాలైంది. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతుల వివరాలు ఇవి.. అంకాలు(50), గజ్జల జనార్ధన్​(34), గజ్జల భవాని(20), నరసింహ(33), సన్నీ(32), దివాకర్​(35)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో జీతన్​, శిరీష గాయాలలతో బయటపడి మృత్యుంజయులయ్యారు.

Next Story