నెల్లూరులో ఘోర ప్ర‌మాదం..భార్య, భర్త, కుమార్తె స్పాట్ డెడ్

by velandi.Saikiran |

నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు స్పాట్ లోనే మరణించారు

నెల్లూరులో ఘోర ప్ర‌మాదం..భార్య, భర్త, కుమార్తె స్పాట్ డెడ్
X

దిశ‌, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు స్పాట్ లోనే మరణించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని కనిగిరి మండలం తెళ్ల‌పాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను బోర్ వేల్ లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళుతున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

వీళ్లు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడం గమనార్హం. భార్య, భర్త, కుమార్తె అని తెలుస్తోంది. మృతులను బాబు(30), మమత(25), విభ(10)గా గుర్తించారు. ఇక ఈ సంఘటన గురించి వివరాలు తెలియగానే, రంగంలోకి పోలీసులు దిగారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అటు మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని అంటున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.






Next Story