- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. కూలీల బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సుమారు 18 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు మృతి చెందినట్లు సమచారం. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన కూలీలు రైల్వే కాంట్రాక్టు పనుల నిమిత్తం అరకు ప్రాంతానికి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, అనంతగిరి మండలం తుమ్మల వలస గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఉన్న కార్మికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. స్థానికులు వెంటనే స్పందించి, వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించి.. స్థానిక ఆస్పత్రులకు తరలించారు.






