రైతుల బాధ వర్ణణాతీతం : వైయస్ షర్మిలా

by Thanuru Gopichand |

మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా పంట నష్టపోయిన రైతుల బాధ వర్ణణాతీతం అని ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా (YS Sharmila) అన్నారు.

రైతుల బాధ వర్ణణాతీతం : వైయస్ షర్మిలా
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా పంట నష్టపోయిన రైతుల బాధ వర్ణణాతీతం అని ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా (YS Sharmila) అన్నారు. రైతుల పక్షాన ఆమె మాట్లాడుతూ పత్తి మొక్కజొన్న రైతులకు (Farmers) మద్ధతు ధర లభించడం లేదన్నారు. తుఫాను కారణంగా చేతికొచ్చిన పంట నష్టపోయి మనోవేదనకు గురయ్యారని చెప్పారు. మిగిలిన అరకొర పంటకైనా మద్ధతు ధర లభిస్తుందని ఆశిస్తే ఆ ఆశపై కూడా నీలుచల్లిన పరిస్థితి నెలకొందన్నారు.

క్వింటా పత్తికి కనీస మద్ధతు ధర రూ.8,110 ఉంటే మార్కెట్లో గరిష్టంగా రూ.7వేలు కూడా రైతులకు లభించడం లేదన్నారు. ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టీ పత్తి పండిస్తే 6 క్వింటాలు కూడా దిగుబడి రాలేదని, మార్కెట్ ధరతో పోల్చితే ఇంకా రూ 10 వేలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారననారు. మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర రూ. 2,400 ఉండగా మార్కెట్ లో ధర రూ. 1400 కూడా ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. తుఫాను ప్రభావంతో ఎకరాకు దిగుబడి 10 క్వింటాలకు తగ్గితే, రూ.35వేలు పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి రూ.20వేల కన్నా ఎక్కువ లేకపోవడం ఆందోళనకరంగా ఉందని రైతులు చెబుతున్నారన్నారు.

మిరపకు రూ.12 వేలు మద్దతు ధర ఉంటే రైతుకి దక్కింది రూ.6వేలేనని పేర్కొన్నారు. వేరుశెనగకు రూ.8వేలు ఉంటే రైతుకి ఇచ్చింది రూ.4వేలే అన్నారు. కంది పంటకు మద్దతు ధర మీద రూ.2వేలు నష్టపోతున్నారని ఆరోపించారు. పెసరకు రూ. 3500 నష్టం, మినుములకు క్వింటాకు రూ. 14 వందల నష్టం, పొగాకు పంట క్వింటాకు రూ.13వేల నష్టానికి, ఉల్లి గడ్డ కిలో 4 రూపాయలకు అమ్ముకున్న దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా పత్తికి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని.. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని.. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Next Story