- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చారు : సీఎం
ఇటీవలే ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చి పనులను పున: ప్రారంభించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలే ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చి పనులను పున: ప్రారంభించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతిలో జరిగిన బ్యాంకు భవనాల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని నిర్మాణానికి మీకు మేము సహకరిస్తామని స్వచ్ఛంధంగా అమరావతి రైతులు ముందుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇది నిజంగా అభినందనీయమని విషయమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి స్ఫూర్తి ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదున్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛంధంగా ల్యాండ్ పూలింగులో ఇస్తామన్నప్పుడు.. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ జరిగిన ప్రాంతం అమరావతి అని భావించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఆగిపోయిన పనులకు ప్రధానమంత్రి వచ్చి పున: ప్రారంభం చేశారన్నారు. 2028 మార్చి నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితి ఉందన్నారు.
పనులు జరుగుతున్నాయంటే కారణం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక అసాధ్యమైన పనిని ప్రారంభించాం.. పనులు స్పీడప్ చేసే సమయంలో ప్రభుత్వం మారింది.. ఐదేళ్లు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారిగా తమకంటే వేగంగా 15వేల కోట్లు ఇవ్వడానికి పనులు ప్రారంభించమని ఆమె భరోసానిచ్చారన్నారు. నేడు 15 బ్యాంకులు వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఇక్కడ నిర్మాణ పనులకు పునాదులు వేశాయన్నారు. దేశంలో ఎక్కడా ఫైనాన్షియల్ సిటీ లేదన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ తాను ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. బ్యాంకుల స్థాపన ద్వారా 6576 మంది ఉపాధి లభిస్తుందన్నారు. రికార్డు టైంలో పనులను పూర్తి చేయాలని బ్యాంకర్లకు విన్నవించారు.
మళ్లీ మీకు ఈ అవకాశం రాదని బ్యాంకర్లతో చెప్పారు. భవనాలను మనం కట్టొచ్చు.. కానీ రాజధానిలో కట్టే అవకాశం తక్కువన్నారు. అందుకు మీ సహకారం కావాలని బ్యాంకర్లను కోరారు. మన దేశం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. వచ్చే ఏడాది మూడో స్థానానికి చేరుకోనుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం స్త్రీ మాత్రమే కాదన్నారు. కుటుంబంలోనైనా ప్రభుత్వంలోనైనా స్త్రీ పాత్ర అద్భుతమైందన్నారు. మహిళా ఆర్థిక మంత్రి నాయకత్వంలో దేశం విజయవంతంగా ముందుకెళ్తోందన్నారు. నిర్మలా సీతారామన్ పని చేసే విధానం అద్భుతంగా ఉందని కొనియాడారు. 2038 వరకు రెండో స్థానానికి 2047కు మొదటి స్థానికి ఆర్థిక విషయంలో భారత్ చేరుతుందన్నారు. మొదటి స్థానం విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదన్నారు.
సూపర్ జీఎస్టీ గురించి ఎవరూ ఊహించలేదన్నారు. ప్రతిపక్షాలు కూడా ఇది చేస్తే చాలా సమస్యలు వస్తాయన్నారని గుర్తు చేశారు. ఆ పరిస్థితుల్లో కూడా అందరికీ నమ్మకం కలిగించారన్నారు. ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్మకం కల్పించారని పేర్కొన్నారు.. ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నారన్నారు. ఆర్థిక మంత్రిని ప్రతిఒక్కరూ అభినందించాలన్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అస్ట్రో ఫిజిక్స్ కు 5 ఎకరాల భూమిచ్చాం. ప్లానిటోరియం, ఎడ్యుకేషన్ సెల్ స్థాపనకు ముందుకొచ్చారు. క్రియేటివిటీ అంటే ఆర్థికమంత్రికి ఇష్టం. ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే అంగీకరించాను అన్నారు. చాలా సమస్యలను అధిగమించడానికి నిర్మాణాత్మక ఇబ్బందులు ఉన్నాయని సీఎం అన్నారు. రాష్ట్ర విభజన, తరువాత జరిగిన నష్టం తరువాత ఎలా మేనేజ్ చేయలని అనుకుంటున్న సమయంలో.. వెంటిలేటర్ పై ఉన్న ఏపీని బయటకు తెచ్చిన ఘన కేంద్ర ప్రభుత్వానిది, ఆర్థిక మంత్రిదని కొనియాడారు. ఇంకా నిలదొక్కుకోవాల్సి ఉందన్నారు. అగ్రిటెక్, ఇన్ఫ్రా, లెటెస్ట్ టెక్నాలజీపై ఫోకస్ చేస్తున్నామన్నారు. ఏరో స్పేస్ సిటీ, స్పేస్ సిటీ, డ్రనో సిటీ, ఎలక్టరానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్, ప్రతిది ప్రారంభిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏపీ అద్భుతంగా ఎదుగుతుందన్నారు.
రైతులను మరోసారి మనస్ఫూర్తి అభినందిస్తున్నామన్నారు. చాలా ఇబ్బందులు పడి సమస్యలను ఎదుర్కొన్నారన్నారు. 56వేల కోట్ల రూపాయల విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుందన్నారు. సీఆర్డీఏ నిన్ననే ప్రారంభించుకున్నామన్నారు. 2027 కల్లా పూర్తవుతున్నారు. 7 జాతీయ రహదారులు రాజధానికి కనెక్ట్ అవుతాయన్నారు. నాడు హైదరాబాద్ కు సైబరాబాద్ యాడ్ చేశామన్నారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అన్నారు. కష్టమైనా అందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అన్నారు.
గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ, నీరు, సుందరీకరణ ఇక్కడ ఉంటాయన్నారు. గ్రీన్ కవర్, నెట్ జీరో పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. రెగ్యులర్ పవర్ వాడబోమని స్పష్టం చేశారు. పదవీ విరమణ తరువాత ఇక్కడ సెటిల్ అవ్వాలని బ్యాంకర్లను కోరారు. ఎస్ఆర్ఎం, ఎన్ఐటీ, బిట్స్ పిలానీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు అమరావతికి రానున్నాయన్నారు. క్వాంటం వ్యాలీ జనవరికి ప్రారంభమవుతుందన్నారు. ప్రధానమంత్రి యూపీఏ తెస్తే దానిపై వేరే దేశాలు మనపై ఆధారపడే పరిస్థితి. టెలికమ్యూనికేషన్ తెస్తే 4జీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నామన్నారు.
ఏ లెటెస్ట్ టెక్నాలజీకైనా అమరావతి హబ్ అవుతుందన్నారు. 2047 నాటికి ఇండియా నెంబర్ వన్ అవుతుందన్నారు. అందులో ఏపీ గణనీయమైన పాత్ర పోషిస్తుందన్నారు. దక్షిణ భారత్ లో తక్కువ తలసారి ఆదాయ ఏపీకి ఉందన్నారు. తెలంగాణకు అత్యధికంగా ఉందన్నారు. నాలెడ్జ్ ఎకానమి, ఇన్ఫ్రా, ఐటీ, బయో టెక్నాలజీ మైదరాబాద్ లో ప్రారంభించామన్నారు. అమరావతిలో జీరో నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాల సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం గోదావరి నీటికి సద్వినియోగం చేసుకునేందుకు సహకరించాలన్నారు.
విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాలు జరిగాయి. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ప్లాంట్ ప్రపైవేటైజేషన్ కి వెళ్లే పరిస్థితి. తెలుగువారి సెంటిమెంట్ రక్షించేందుకు ముందుకొచ్చారు ఆర్థికశాఖ మంత్రి. పోటీలోకి తెచ్చేందుకు అన్ని చేశారన్నారు. గోదావరి నీరు సముద్రానికి చేరుతున్నాయన్నారు. వాటిలో 2800ల టీఎంసీలు సముద్రం 200ల టీఎంసీలు వాడితే కరువ రాదన్నారు. పోలవరం నుంచి నల్లమల్ల రిజర్వాయర్ కు పరాజెక్ట్ రూపొందించారు. మూడు సంవత్సరాల్లో పూర్తి చేయగలితే ఏపీకి వరమవుతుందన్నారు. రాయలసీమ శశ్యశ్యామలమవుతుందని తెలిపారు. మిగులు జలల కోసమే ఈ ప్రాజెక్ట్. దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చే ప్రాజెక్టుకు సహకరించాలని విన్నవించారు.
ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారే పరిస్థితి నెలకొందన్నారు. త్రాగునీరు లేని పరిస్థితి ఉండేదన్నారు. హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు ముందు కెళ్తున్నారు. ఒకసారి ఆలోచించి సహకరిస్తే ప్రపంచానికే గర్వకారణంగా పండ్లు, కూరగాయాలు ఎగుమతి చేసేలా రూపుదిద్దుకుంటుందన్నారు. పూర్వోదయ ప్రాజెక్ట్ కింద సహకరిస్తే ఉత్తారంధ్ర డెవలప్ అవుతుందని వివరించారు. ఐదు సంవత్సరాలు సహకరించి, నిలదొక్కుకొని దేశానికి బ్యాక్ బోన్ గా తయారు చేసుకుంటామన్నారు. అందుకు పలు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. సంస్కరణల తరువాత మొట్టమొదటిసారిగా 50 బిలియన్ డాలర్లు వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ గూగుల్ డేటా సెంటర్ అని గుర్తు చేశారు. సంస్థ అనుమానాలను తీర్చి విశాఖకు వచ్చేలా చేయడంలో ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి కీలక పాత్ర పోషించారన్నారు.. అందుకు ధన్యవాదాలను తెలియజేశారు.






