ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం.. ఫారెస్ట్ అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏనుగుల(Elephant) దాడిలో రైతు దుర్మరణం(Farmer Death) చెందారు.

ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం.. ఫారెస్ట్ అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏనుగుల(Elephant) దాడిలో రైతు దుర్మరణం(Farmer Death) చెందారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రైతు రామకృష్ణంరాజు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చింతించారు. బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు వెళ్తున్న మార్గాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, ఆయా ప్రాంతాల రైతులకి ముందుగా సమాచారం అందించాలని దిశానిర్దేశం చేశారు. రామకృష్ణంరాజు కుటుంబాన్ని అటవీశాఖ, జిల్లా యంత్రాంగం పరామర్శించి పరిహారం అందించాలని ఆదేశించారు. కాగా, రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య రాధిక, కుమార్తెలు గాయత్రి(డిగ్రీ), నికిత(బీటెక్), కుమారుడు గణేష్ (ఇంటర్) ఉన్నారు.

Next Story