బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్.. హిందూపురంలో కాన్వాయ్ అడ్డగింత

by Gantepaka Srikanth |

నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇవాళ సొంత నియోజకవర్గమైన హిందూపురం(Hindupuram)లో పర్యటించారు.

బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్.. హిందూపురంలో కాన్వాయ్ అడ్డగింత
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇవాళ సొంత నియోజకవర్గమైన హిందూపురం(Hindupuram)లో పర్యటించారు. సోమవారం ఉదయం నియోజకవర్గంలోకి ఎంటర్ అవ్వగానే బాలకృష్ణ కాన్వాయ్‌ని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జై బాలయ్య అంటూ పెద్ద నినాదాలు చేశారు. బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకొని డిమాండ్ చేశారు. స్పందించిన బాలయ్య.. అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుందని.. ఓపిక పట్టాలని అంటూ అభిమానులకు నచ్చజెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని.. ఇంకా ఏం కావాలంటూ అడిగారు. అంతకుముందు బసవనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. హిందూపురంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని ప్రకటించారు. మూడు నెలల్లోనే పనులు పూర్తి చేసి సేవలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఆస్పత్రిలో సేవలు కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడంతో ప్రశంసలు దక్కాయని గుర్తుచేశారు. కాగా, హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. వీడియో

Next Story