- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: శ్రీవారి తోమాల సేవలో ప్రముఖ మాజీ క్రికెటర్..
నేడు భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

దిశ, తిరుమల: నేడు భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. కాగా వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. శనివారం వేకువ జామున సుప్రభాతం, తోమాల సేవలో భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తరువాత వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల అఖిలాండడం వద్ద బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
Read More..
శ్రీవారి సుప్రభాత సేవలో తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్..






