- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా ఎవరూ చేయొద్దు.. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యుల రిక్వెస్ట్
పాస్టర్ ప్రవీణ్ మృతి దుష్ప్రచారాలు వెల్లువెత్తిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల కీలక విజ్ఞప్తి చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్(Pastor Praveen) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ మృతిపై అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్ మృతికి ముందు ఆయన బుల్లెట్‌పై రోడ్డు ప్రయాణ చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ పుటేజులను బయటకు వస్తున్న నేపథ్యంలో పాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు వెల్లువెత్తాయి.
దీంతో పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ మరణంపై కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పాస్టర్ ప్రవీణ్ తమ్ముడు కిరణ్(Pastor Praveen Brother Kiran) అన్నారు. ప్రవీణ్ మరణాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని, ఇలాంటివి ఆపివేయాలని కోరారు. ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, దయచేసి సహకరించండని కిరణ్ విజ్ఞప్తి చేశారు.
తన భర్త మృతిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా(Pastor Praveen Wife Jessica) అన్నారు. దర్యాప్తు సమయంలో అందరి సహకారం కోరుతున్నానని తెలిపారు. ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించిందని పేర్కొన్నారు. దర్యాప్తుని తప్పుదోవ పట్టించేలా ఎవరూ చేయవద్దని, ఇది ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా తెలిపారు.






