- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుంటేనే ప్రేమాభిమానాలు.. ఇంటి నుంచి వ్యక్తిని గెంటేసిన కుటుంబ సభ్యులు..
అన్నీ బాగుంటేనే.. ముఖ్యంగా డబ్బుంటేనే ప్రేమాభిమానాలు ఉంటాయనేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ ఘటన.

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నీ బాగుంటేనే.. ముఖ్యంగా డబ్బుంటేనే ప్రేమాభిమానాలు ఉంటాయనేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ ఘటన. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిపోయి ఉన్న అతనికి అన్నీ తామై నిలబడాల్సిన తండ్రి, అన్నదమ్ములు బయటికి గెంటేశారు. దిక్కుతోచక వీల్ చైర్ లోనే ఇంటి బయట ఉన్న ఆ వ్యక్తిని చూసి స్థానికులు చలించిపోయారు. సింగపూర్ లో ఉద్యోగం చేసి డబ్బులు పంపినపుడు అంతా బాగానే ఉన్నారని, ఇప్పుడు తన వైద్యానికి డబ్బు అడిగితే ఇలా చేస్తుండటం ఏం బాలేదని వాపోయాడతను.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తాడిశెట్టి నాగత్రినాథ్ కు తండ్రి నాగేశ్వరరావు, అన్న నాగశ్రీను, తమ్ముడు నాగరాజు కిరణ్ ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన త్రినాథ్ 2018లో సింగపూర్ వెళ్లి ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొద్దిరోజులకే తల్లి చనిపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగి సింగపూర్ కు వెళ్లిపోయారు. ప్రతినెలా రూ.60 వేలు తండ్రి, తమ్ముడు అకౌంట్స్ కు పంపేవారు. గతేడాది జులైలో తిరిగి సొంతూరికి వచ్చేయగా తమ్ముడు పెళ్లి చేసుకునే ప్లాన్ లో ఉన్నాడని తెలిసి.. ముందు తనకు చేయాలని అడిగారు. ఈ క్రమంలో సింగపూర్ లో మళ్లీ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. సింగపూర్ కు వెళ్లకముందే డిసెంబర్ 31న బైక్ నుంచి జారి పడిపోవడంతో నడుముకు గాయమై రెండుకాళ్లు చచ్చుబడ్డాయి.
వైజాగ్ లోని ఓ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చేయించుకుంటుండగా.. రూ.6 లక్షలు ఖర్చయింది. తన సేవింగ్స్ రూ.4 లక్షలూ వైద్యానికి అవ్వగా.. మరో రూ.2 లక్షలు కడితేనే కంటిన్యూ చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో డబ్బు కోసం వేల్పూరులోని ఇంటికి వెళ్లారు. కానీ.. తండ్రి, అన్నదమ్ములు అతడిని ఇంట్లోకి రాకుండా అడ్డుపడటంతో షాకయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీల్ ఛైర్ లోనే ఇంటి ఎదుట రోడ్డుపై ఉండటాన్ని చూసి స్థానికులు చలించి.. వారిని ప్రశ్నించినా స్పందన లేదు. తాను ఉద్యోగం చేసి పంపిన డబ్బు పంపినపుడు అంతా బాగానే ఉందని, ఇప్పుడు ఇంట్లోకి కూడా రానివ్వడం లేదంటూ వాపోయిన తీరు అక్కడి వారిని కలచివేసింది. మనిషి దగ్గర డబ్బు లేకపోయినా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రేమాభిమానాలు కనిపించవని చెప్పుకున్నారు.






