రూ.50 వేలు అప్పు ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం .. భార్య, కొడుకు మృతి..

by Thanuru Gopichand |   (  Updated:2025-09-17 12:24:40  IST  )

రూ.50 వేలు అప్పు ఇచ్చారు... తిరిగి ఇవ్వమని అడిగినందుకు అప్పు తీసుకున్న వ్యక్తి పురుగుల మందు తాగాడు..

రూ.50 వేలు అప్పు ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ..  భార్య, కొడుకు మృతి..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : రూ.50 వేలు అప్పు ఇచ్చారు... తిరిగి ఇవ్వమని అడిగినందుకు అప్పు తీసుకున్న వ్యక్తి పురుగుల మందు తాగాడు.. దీంతో భయపడిన అప్పు ఇచ్చిన కుటుంబం ఒత్తిడికి గురైంది... అప్పు ఇచ్చిన వక్తి పురుగుల మందు తాగగా.. అతని భార్య కొడుకు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళిత.. సత్తెనపల్లి మండలం ఫణిదం అనే గ్రామంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి భార్య, కొడుకుతో నివా సం ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వరు అనే వ్యక్తి కి శ్రీనివాసరావు రూ.50 వేలు అప్పు ఇచ్చారు. గత కొన్నిరోజులుగా అప్పు డబ్బులు తిరగి ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. అయినా వెంకటేశ్వర్లు అప్పు తీర్చడం లేదు. దీంతో మంగళవారం వెంకటేశ్వర్లు ఇంటికి శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కొడుకు వెంకటేశ్ వెళ్లారు. అప్పు చెల్లించాలంటూ గట్టిగా నిలదీశారు.

అయితే.. తాను రూ.50 వేలు అప్పు చెల్లించలేనంటూ వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగాడు. దీంతో పూర్ణకుమారి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భర్త శ్రీనివాసరావుకు తెలియజేసింది. వెంకటేశ్వర్లు ప్రాణానికి అపాయం ఉంటుందేమోనని శ్రీనివాసరావు కుటుంబం తీవ్రంగా ఒత్తిడికి గురైంది. వెంకటేశ్వర్లు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు కూడా వారికి తెలిసింది. దీంతో కంగారుపడిన శ్రీనివాసరావు పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత భార్య పూర్ణకుమారి, కొడుకు వెంకటేశ్‌తో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. పూర్ణకుమారి మృతదేహం దొరికింది. వెంకటేశ్‌ మృతదేహం కోసం గాలిస్తున్నారు. పురుగుల మందు తాగిన శ్రీనివాసరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story