హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్సైట్

by Muthe.Rajitha |

హరిత హోటల్ పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది.

హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్సైట్
X

దిశ, వెబ్ సైట్ : హరిత హోటల్ పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. శ్రీశైలంలో ఏపీ టూరిజం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ నిర్వహిస్తూ ఏడాదిగా మోసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు ఆన్‌లైన్‌లో శ్రీశైలంలో హరిత హోటల్ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి వసతి గది, దర్శనం కోసం రూ.15,950 ఫోన్‌ పే చేసి బుకింగ్ రశీదు తీసుకొని గత ఆదివారం శ్రీశైలం వచ్చి స్థానిక పర్యాటక శాఖ రిసార్ట్‌కు వెళ్ళాడు.

తీరా అక్కడికి వెళ్ళాక ఆ రశీదు నకిలీదని టూరిజం సిబ్బంది చెప్పడంతో షాక్ అయ్యాడు. కాగా హరిత రిసార్ట్ మేనేజర్ సదరు నకిలీ వెబ్‌సైట్ గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శ్రీశైలం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. భక్తులు, పర్యాటకులు నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించకుండా అధికారిక వెబ్‌సైట్‌లోనే వసతి గదులు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story