మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ టీటీడీ సిఫార్సు లెటర్స్

by Muthe.Rajitha |

ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ సిఫారసు లెటర్స్ జారీ కావడం కలకలం రేపింది.

మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ టీటీడీ సిఫార్సు లెటర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ సిఫారసు లెటర్స్ జారీ కావడం కలకలం రేపింది. మంత్రి పేరుతో జారీ అయిన లెటర్స్ తో తాము మోసపోయినట్టు కొందరు బాధితులు మంత్రి ఆఫీసులో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంత్రి సత్యకుమార్ పీఏ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. నకిలీ సిఫారసు లేఖల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.

Next Story