Fake Liquor Scam | జోగి రమేశ్ కు రిమాండ్ పొడిగింపు

by Thanuru Gopichand |

Fake Liquor Scam | జోగి రమేశ్ కు రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేశ్ (Jogi Ramesh) కు ఎక్సైజ్ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. నేటితో ఆయనకు విధించిన రిమాండ్ ముగియడంతో ఎక్సైజ్ పోలీసులు ఆయనను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఆయనతో పాటు ఇతర నిందితులైన జోగి రాము, అద్దెపల్లి జనార్ధన్ రావు, మరో నలుగురు నిందితులను కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్ గడువును పెంచాలని ఎక్సైజ్ అధికారులు కోరుతూ పిటిషన్ ను దాఖలు చేశారు. విచారించిన కోర్టు నిందితులకు డిసెంబర్ 9 వరకు రిమాండ్ ను పొడిగించింది. దీంతో వారిని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు అధికారులు తరలించారు.

Next Story