Breaking: నకిలీ మద్యం కేసులో జనార్ధన్ రావు అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-10 13:01:59  IST  )

నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్ధన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు..

Breaking: నకిలీ మద్యం కేసులో జనార్ధన్ రావు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో నిందితుడు జనార్ధన్‌రావు(Janardhan Rao)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు(Mulakala cheruvu)లో నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడిగా జనార్ధన్‌రావు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనను తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. సౌతాఫ్రికా నుంచి విజయవాడకు రావడంతో జనార్ధన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. జనార్ధన్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టుకు వచ్చిన జనార్ధన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ‌ పెట్టే అవకాశం ఉంది.

Next Story