- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరుతో ఫేక్ లెటర్... సోషల్ మీడియాలో కలకలం
రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ లేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ లెటర్‌లో రాసి ఉంది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Jansena Chief Pawan Kalyan) పేరుతో సోషల్ మీడియాలో నకిలీ లేఖ(Fake Letter) విపరీతంగా వైరల్ అవుతోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ(Tdp Leader Nvsn Varma)కు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ లెటర్‌లో రాసి ఉంది. ఈ ఫేక్ లెటర్‌లో 2024 ఎన్నికల సమయంలో వర్మ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కోసం వర్మ తన పిఠాపురం సీటును త్యాగం చేసి, ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించి విజయంలో కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దుండగులు ఈ లేఖను అత్యంత చాకచక్యంగా డిజైన్ చేశారు. అయితే ఈ లేఖపై ముందస్తుగా మే 17వ తేదీని వేసి ఉండటం విచిత్రంగా అనిపిస్తోంది. మరోవైపు ఇది నిజమైన లేఖలాగే కనిపిస్తుండటంతో ప్రజలు సైతం దీన్ని నిజమేనని నమ్ముతున్నారు.
టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్
ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ లేఖ విపరీతంగా షేర్ అవుతోంది. ఈ విషయం జనసేన అధినాయకత్వం దృష్టికి వెళ్లడంతో వారు అప్రమత్తమయ్యారు. పార్టీ పరువు నష్టం కలిగించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ నకిలీ లేఖను ఎవరు సృష్టించారు, దీని వెనుక ఉన్న శక్తులు ఎవరు అనే కోణంలో జనసేన ఐటీ వింగ్ ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో కూడా పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.






