- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. పోలీసుల కస్టడీలోకి వల్లభనేని వంశీ
గన్నవరం (Gannavaram) నియోజకవర్గ పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఇప్పటికే నూజివీడు కోర్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi Mohan)ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం (Gannavaram) నియోజకవర్గ పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఇప్పటికే నూజివీడు కోర్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi Mohan)ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పూర్తి వివరాలతో పాటు కీలక సాక్ష్యాధారాలను రాబట్టేందుకు వంశీని ఏడు రోజులు కస్టడీకి అనుమతించాలని ఈనెల 19న హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజీవీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు ఆ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపట్టిన నూజివీడు సెకండ్ అడిషనల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇరు పక్షాల వాదనలు విని వల్లభనేని వంశీని 2 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే చేయాలని, నిందితుడి వెంట న్యాయవాదిని అనుతించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో (Vijayawada Government Hospital)లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హనుమాన్ జంక్షన్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించి ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.






