- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలంలో భక్తులకు నకిలీ టికెట్లు.. ఇద్దరి అరెస్ట్
శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేపాయి...

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేపాయి. పాత దర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. దీంతో ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి శ్రీశైలం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలి టికెట్ల అమ్మకాలు, భక్తులు కొనుగోళ్లపై ఆరా తీశారు. నకిలీ టికెట్లు అమ్మింది ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు. అయితే వీరిలో ఒకరు గతంలోనూ నకిలీ టికెట్ల అమ్మకాలు జరుపుతూ దేవస్థానం సిబ్బందికి దొరికారు. ఆన్ లైన్ ద్వారా భక్తులకు విక్రయించే రూ. 500 టికెట్లను డేట్ మార్చి మళ్లీ ఫ్రెష్‌గా తయారు చేసి రూ. 900 అమ్ముతున్నారు. గతంలో జారీ చేసిన టికెట్లపై నకిలీ రబ్బర్ స్టాంపుల ముద్ర వేసి విక్రయిస్తున్నారు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
గత నెల 14న శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కొంత మంది భక్తులు వెళ్లారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో టికెట్ల కొనేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారి వద్దకు ఇద్దరు వెళ్లారు. స్వామి వారి టికెట్లు ఉన్నాయని, డబ్బులు తీసుకుని నకిలీ టికెట్లు అమ్మారు. ఆ టికెట్లను తీసుకుని క్యూలైన్‌లో వెళ్లారు. కానీ స్కానింగ్ సెంటర్ నకిలీ వ్యవహారం బయటపడింది. ఆ టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో దర్శనానికి భక్తులను అనుమతించలేదు. దీంతో పోలీసులకు దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.






