అన్నమయ్య జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. 10 మంది అరెస్టు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-07 10:51:58  IST  )

అన్నమయ్య జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేగింది...

అన్నమయ్య జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. 10 మంది అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaya District)లో నకిలీ నోట్ల కలకలం రేగింది. మదనపల్లె కేంద్రంగా వాయల్పాడుకు చెందిన పదిమంది నకిలీ నోట్లు ముద్రస్తున్నారు. అంతేకాదు ఈ నోట్లను ఏపీ, కర్ణాటక, తమిళనాడులో చెలామణి చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై దాడి చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన రాథోడ్, కుమార్‌, బాబు ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 3.67 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story