సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం .. కేసు నమోదు చేసిన సీఐడీ

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మాట్లాడిన వీడియోను మార్చి.. యూరియా, పురుగుల మందు వినియోగంపై అసత్య కామెంట్స్ చేసిన వీడియోలను వైరల్ చేసినట్లు ఏపీ సీఐడీ (AP CID) గుర్తించింది.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం .. కేసు నమోదు చేసిన సీఐడీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మాట్లాడిన వీడియోను మార్చి.. యూరియా, పురుగుల మందు వినియోగంపై అసత్య కామెంట్స్ చేసిన వీడియోలను వైరల్ చేసినట్లు ఏపీ సీఐడీ (AP CID) గుర్తించింది. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ఈ ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. రైతులకు సీఎం ఇచ్చిన సూచనల వీడియోను.. పురుగుల మందులు, యూరియా వినియోగాన్ని తగ్గించాలని చెప్పినట్లుగా మార్చి.. వైరల్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఐజీ హెచ్చరించారు. సీఎం వీడియోలను ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు (AI Fake Video) క్రియేట్ చేసినట్లు గుర్తించిన సీఐడీ.. దీనిపై కేసు నమోదు చేశారు.

"ముఖ్యమంత్రి ప్రసంగాన్ని కూడా తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసి ఆయన ఏపీ రైతులకు వార్నింగ్ ఇచ్చినట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా విషయంలో ఫేక్ ప్రచారాలకు దిగి రైతులను ఆందోళనకు గురిచేస్తున్న కొందరు కుట్రదారుల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించారు. కాబట్టి రైతులు కానీ, ప్రజలు గానీ ఇటువంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దు. ఇతరులకు షేర్ చేయవద్దు. ముఖ్యమంత్రి విషయంలో ఇటువంటి ఫేక్ వీడియోలను తయారుచేసి, ఇతరులకు పంపిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది." అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం (AP Fact Check) ఎక్స్ (X) లో వీడియోను పోస్ట్ చేసింది.

వీడియోను ఇక్కడ చూడండి

Next Story