- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:‘వైఫల్యం విజయానికి సోపానం’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాల(Nirmala College of Pharmacy)లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాల(Nirmala College of Pharmacy)లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని పేర్కొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ పండుగ సంతోషంగా జరుపుకోవాలి.
ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. సిస్టర్స్ నన్ను కలిసినప్పుడు నాకు చిన్నప్పటి పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయి అన్నారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ. మనమేంటో ఇతరులకు తెలియజెప్పడం. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారు. 2019 నుంచి మంగళగిరిలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి ఎన్నికల్లో ఓటమి చెందాను. ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్నాను. ఎన్ని ఓటములు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. వైఫల్యం విజయానికి సోపానం. అందుకు నేనే ఉదాహరణ. దేవుడు మనకు అనేక పరీక్షలు పెడతాడు. వాటన్నింటిని కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి శక్తినిస్తాడు.
మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలి. దేశానికి నువ్వేమి చేశావని గుర్తుంచుకోవాలని అన్నారు. వందేళ్ల స్వతంత్ర భారత్ దిశగా ప్రయాణిస్తున్న సమయంలో 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అన్నారు. ఇందుకు యువత తమ వంతు బాధ్యత వహించాలి. మా కుటుంబంలో కూడా క్రిస్మస్ తో పాటు అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రతి ఒక్కరు ఇతరుల పట్ల సహనంతో వ్యవహరించి.. మన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలి అని పేర్కొన్నారు.






