- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
New Helicopter: సీఎం చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్ కాదట..! ఫ్యాక్ట్‌చెక్ క్లారిటీ ఇచ్చింది ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు భద్రత కోసం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు భద్రత కోసం కొత్త హెలికాప్టర్ (New Helicopter) కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పాత హెలికాప్టర్‌కు బదులుగా ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసినట్లు ఓ హెలికాప్టర్ వీడియో చక్కర్లు కొడుతోంది. రెండు వారాలుగా జిల్లాల పర్యటనకు సీఎం ఈ కొత్త హెలికాప్టర్‌లోనే వెళ్తున్నారని, ఈ హెలికాఫ్టర్ ద్వారా జిల్లాల పర్యటనలు మరింత సులభంగా, వేగంగా జరుగుతాయని వార్తలు వచ్చాయి. కొత్త హెలికాప్టర్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉండడంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే, (CM Chandrababu) చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్ నిజం కాదంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా @FactCheckAPGov ఫ్యాక్ట్‌చెక్ క్లారిటీ ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనల నిమిత్తం ప్రభుత్వం అధునాతన హెలికాప్టర్ కొనుగోలు చేసిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. విషయం ఏమిటంటే, సీఎం పర్యటనల నిమిత్తం అద్దెకు తీసుకునే పాత హెలికాప్టర్ స్థానంలో వేరే అధునాతన మోడల్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడం జరుగుతుంది. ఈ కొత్త మోడల్ అద్దెకు తీసుకోవడం వల్ల భద్రత, సౌకర్యం మెరుగ్గా ఉంటాయి. ఖర్చు తగ్గుతుంది. అంతేకానీ కొత్త హెలికాప్టర్ కొనడం లేదు. వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా కొందరు ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతున్నారు. వాటిని నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది.






