సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది.. కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి చెప్పిన నిజాలు

by Ajay Maddhiboyina |

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ప్రత్యక్షసాక్షులు, ప్రయాణికులు కీలక విషయాలు వెల్లడించారు. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయిందని అన్నారు. కళ్లు మూసి తెరిచే లోపలో భారీగా మంటలు వ్యాపించాలని చెప్పారు.

సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది.. కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి చెప్పిన నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ప్రత్యక్షసాక్షులు, ప్రయాణికులు కీలక విషయాలు వెల్లడించారు. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయిందని అన్నారు. కళ్లు మూసి తెరిచే లోపలో భారీగా మంటలు వ్యాపించాలని చెప్పారు. వెనకాల కూర్చుకున్న ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టడం వల్ల దాని నుండి కొందరు బయటపడ్డారని అన్నారు. అంతే కాకుండా ఐదుగురు ప్రయాణికులు ఎమర్జెన్సీ విండో నుండి బయటకు వచ్చారని చెప్పాడు. ఇదిలా ఉంటే బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వాల్వా బస్సుకు ప్రమాదం జరిగింది. బస్సును బైక్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇది జరగ్గా 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 11 మంది ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్షతగాతృలు ఆస్ప‌త్రిలో చికిత్స పొంద‌తున్నారు.

Next Story