Ys Jagan: జగన్ కు కంటి పరీక్ష.. ఎందుకంటే..

by Thanuru Gopichand |

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కంటి పరీక్ష చేయించుకున్నారు.

Ys Jagan: జగన్ కు కంటి పరీక్ష.. ఎందుకంటే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (Ys Jagan) కంటి పరీక్ష(eye test) చేయించుకున్నారు. పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలో ఆయన రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10 కోట్లతో ఆధునికీకరణ చేసిన వైయస్‌ రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగానే ఆయన కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి(Rajareddy) ఆస్పత్రి సేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వైద్యశాలకు వైఎస్సార్‌ ఫౌండేషన్‌ స్ధలం సమకూర్చడంతో పాటు సుమారు రూ. 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి, అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆస్పత్రిని అధునికీకరించడం విశేషం. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు.

Next Story