- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తస్మాత్ జాగ్రత్త...ఏపీలోని ఈ ప్రాంతాలకు తీవ్ర వడగాల్పులు..!
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మండలాలలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మొన్నటి వరకు వర్షాలు ఏపీని అతలాకుతలం చేయగా.. ఇక ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. క్రమ క్రమంగా ఏపీ వ్యాప్తంగా మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు వడగాల్పులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మండలాలలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొంది. మరో 68 మండలాలలో కూడా వడగాల్పులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
ఎక్కువ శాతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అటు రాయలసీమ జిల్లాల్లోని పలు మండలాలకు ఈ వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. నేడు వడగాల్పుల ప్రభావిత ప్రాంతాలలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గ్యారెంటీ అని తెలిపింది. ఇక ఈ వడగాల్పుల ప్రభావం ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని పేర్కొంది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డిహైడ్రేషన్ కు గురికాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.
శనివారం శ్రీకాకుళం(జి) బూర్జ, విజయనగరం(జి)బాడంగి,బొబ్బిలి, దత్తిరాజేరు,గుర్ల,మెరకముడియం, రాజాం,రేగడిఆముదాలవలస, సంతకవిటి,తెర్లాం,వంగర మన్యం (జి) బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు,సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు(16)ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు #APSDMA ఎండీ ప్రఖర్ తెలిపారు pic.twitter.com/tNW9J2wBUE
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) March 27, 2026






