విజయవాడలో విస్తృత తనిఖీలు

by Thanuru Gopichand |   (  Updated:2025-05-09 04:46:25  IST  )

పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రజా భద్రత కోసం ఏపీ పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.

విజయవాడలో విస్తృత తనిఖీలు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : భారత్​పాకిస్తాన్​ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజా భద్రత కోసం ఏపీ పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి విజయవాడలో తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు నేతృత్వంలో బస్టాండు, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లను స్వయంగా పరిశీలించి అక్కడి సీసీ కెమెరాల పనితీరు ఏ విధంగా ఉన్నది, ఇతర భద్రతాపరమైన అంశాల గూర్చి పరిశీలించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్స్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల మోనిటరింగ్ చేస్తూ ఉండాలని, ఎవరైనా అనుమాంత వ్యక్తులు అపరిచితులు తారసపడితే వెనువెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ యాజమాన్యానికి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి విమర్శించినా, తప్పుడు ప్రచారం చేసినా, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా కఠినంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడిన, సందేహం కలిగేలా ఎవరి కదలికలనైనా గుర్తించిన, ప్రమాదకరమైన (పేలుడు పదార్థాలు వంటివి) వస్తువులను కనుగొన్న, వెంటనే సమాచారం 9440796400 కు అందించాలని సూచించారు.

Next Story