Good News: జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగింపు

by Vemula.Srinu Prasad |

వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో యం.యస్ నెం: 43 ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. ...

Good News: జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగింపు
X

దిశ, ఏపీ బ్యూరో: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో యం.యస్ నెం: 43 ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం ప్రీమియం క్రింద రూ.1250 www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి లబ్ధి పొందవలసినదిగా సంచాలకులు చెప్పారు. హెడ్ ఆఫ్ అకౌంట్ :8342-00-120-01-03-001-001, డీడీఓ కోడ్ : 2703 0802 003 ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఫొటోలు, జేపీజీ ఫార్మాట్‌లో సంబంధిత జిరాక్స్ కాపీలను, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని రెండవ ఫ్లోర్‌లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, సంచాలకుల కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం తన వాటా రూ.1,250 చెల్లిస్తుందన్నారు. జర్నలిస్టు, భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు.

Next Story