Breaking: జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-27 13:56:44  IST  )

జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది...

Breaking: జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర జర్నలిస్టుల అక్రిడిటేషన్(Accreditation of Journalists) గడువుపై ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలలపాటు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి శుక్రవారం (28/02/2025)తో ముగియనుంది. దీంతో మే నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతోందని, అలాగే ఇళ్ల స్థలాలపై చర్చిస్తామని గతంలోనే రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి(Minister Kolusu Parthasaradhi) తెలిపారు. అయితే గత ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డుల విషయంలోనూ నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అయినా అర్హులందరికీ అవకాశం ఇస్తుందని జర్నలిస్టులు ఆశించారు. కానీ పాత కార్డుల గడువునే పెంచడంతో కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టుల్లో ప్రభుత్వ ప్రకటన నిరాశనింపిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల తర్వాతైనా అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు.

Next Story