- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు : ఏపీ బిజెపి అధ్యక్షుడు
ఏపీ అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక అడుగు.

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను (Green Ammonia) జర్మనీతో పాటు ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తారని ఏపీ బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన శనివారం మాట్లాడారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ చరిత్ర సృష్టించనుందని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడలో చేపట్టిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ఈ తరహా తొలి అతిపెద్ద ప్రాజెక్ట్ అన్నారు. 10 బిలియన్ డాలర్ల ఇంటిగ్రేటెడ్ పెట్టుబడిలో 7.5 గిగావాట్స్ సోలార్-విండ్ కెపాసిటీ, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు కోసం పరికరాల నిర్మాణం ప్రారంభం కావడం సరికొత్త మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది ఏపీని గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మార్చడానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుందని తెలిపారు. సరికొత్త మైలురాయిని ఏపీ సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ ఏపీ ప్రజలు గర్వించే స్థాయికి రాష్ట్రానికి తీసుకెళ్తుందని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందనడానికి ఇదొక మచ్చు తునకగా నిలుస్తోందని తెలిపారు.
Read More..






