నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. రిమాండ్

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు..

నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసులో మరో ఇద్దర్ని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో గోవాకు చెందిన శిబూ, జనేష్‌ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఏ1 జనార్దనరావుకు స్పిరిట్ సరఫరా చేసిన వారితో వీరికి సంబంధాలు ఉన్నట్లు నిర్దరణ అయింది. ఈ మేరకు వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వారిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితులు శిబూ, జనేష్ ను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా సైతం మరో ఇద్దర్ని అరెస్ట్ చేయడంతో అక్రమార్కుల్లో భయం మరింత పెరిగింది.

Next Story